క్యాన్సర్ ను గుర్తించడం ఎలా?

30
- Advertisement -

నేటి రోజుల్లో క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి పది మందిలో ఒకరు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే క్యాన్సర్ ను ముందుగా గుర్తించలేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నా మాట. క్యాన్సర్ లో రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్.. ఇలా చాలానే రకాలు ఉన్నాయి. అయితే ఎలాంటి క్యాన్సర్ నైనా ప్రారంభ దశలో గుర్తించక పోవడం వల్లే వ్యాధి తీవ్రత ముదిరి ప్రాణాలు కోల్పోతున్నారు చాలమంది.

అందువల్ల క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం ఏదైనా క్యాన్సర్ కు లోనవుతున్నప్పుడు శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని గురించి వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రారంభంలోనే క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నా మాట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గినప్పుడు గళ్ళ లో రక్తం పడడం, విపరీతమైన గురక రావడం, ఛాతీలో నొప్పి ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ కు ప్రారంభ లక్షణాలే వీటిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం తీసుకోవడం లంగ్ క్యాన్సర్ నుంచి బయట పడవచ్చు.

మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి వేధిస్తుంటాయి. వీటిని ఎలా గుర్తించాలంటే రొమ్ములో ఏదైనా వాపు, రొమ్ము నుంచి నీరు కారడం వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. అలాగే పొట్టి కడుపులో నొప్పి, నెలసరికి మధ్య రక్తస్రావం, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వంటివి గర్భాశయ లక్షణాలు కావొచ్చు. కాబట్టి వీటిని ముందుగానే గుర్తించి వైద్యుడిని తప్పక సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని లక్షణాలను ముందే గుర్తించడం ద్వారా క్యాన్సర్ నుంచి త్వరగా బయట పడవచ్చు.

Also Read:బాబు ప్లాన్.. ఎన్నికల ప్రచారంలో ఆ ఇద్దరు?

- Advertisement -