పర్వతాసనం వేస్తే ఎన్ని ఉపయోగాలో..!

42
- Advertisement -

ఈ యొక్క ఆసనం చూడడానికి పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని పర్వతాసనం అంటారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా వెన్ను భాగంలోని కండరాలకు శక్తి లభించి దృఢంగా తయారవుతాయి. అంతే కాకుండా పిరుదుల భాగంలోని అలాగే ఉదర భాగంలోని పెరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. వెన్నెముక నుంచి మెదడుకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. రక్తపోటు ను అదుపులో ఉంచడంలో కూడా ఈ ఆసనం ఎంతొగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ ఆసనం ఎంతో ప్రయోజనకరం. తల వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తుగాను కాంతివంతంగాను తయారవుతుంది.

పర్వతాసనం వేయు విధానం

ముందుగా మోకళ్లపై కూర్చొని, శరీర భారాన్ని చేతులపై మోపుతూ నడుము భాగాన్ని ఒంచాలి. చేతులకు మోకాళ్ళకు కనీసం ఒక మీటర్ దూరం ఉండేలా చూసుకోవాలి. తరువాత శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ పిరుదుల భాగాన్ని పైకి ఫోటోలో చూపిన విధంగా పైకి లేపాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడూ కాళ్ళను ఒంచరాదు. తలను చేతుల మద్య ఉంచి నాభి భాగాన్ని చూస్తూ ఉండాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడూ శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ వీలైనంతా సమయంలో ఈ ఆసనం వేసి తరువాత యథాస్థితికి చేరుకోవాలి.

గమనిక
మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు. అలాగే ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -