జీమెయిల్‌ డేటాతో నిండిపోయిందా..ఇలా డిలీట్ చేయండి

256
gmail
- Advertisement -

జీమెయిల్‌ అందరికీ తెలిసిందే, అందరూ ఉపయోగించేదే. కానీ అందులో ఉన్న ఫీచర్ల గురించి చాలామందికి తెలియదు. ఆ ఫీచర్లను ఉపయోగించుకుంటే కనుక మీ మెయిల్‌ అకౌంట్‌ మరింత సౌలభ్యంగా మారుతుంది.సాధారణంగా జీమెయిల్‌లో 15జీబీ స్టోరేజ్‌ లభిస్తుంది. అయితే నిరంతరం ఇందులో యాడ్లు, ప్రమోషన్లు, ఆఫీస్‌ మెయిల్స్‌ వస్తుంటాయి. మనం పనుల్లో పడి వాటిని చూడకపోవడంతో ఇన్‌బాక్స్‌ అనవసర మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. దీంతో స్టోరేజ్ సమస్య తలెత్తి డిలీట్ చేయాలంటే చిర్రెత్తుకొసోస్తుంది.

అయితే అలా జీమెయిల్ నిండిపోయినా వారు తమ మెయిల్స్‌ను ఇలా ఖాళీ చేసుకోవచ్చు.అన్ని మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్‌ చేసేందుకు మొదట కంప్యూటర్లోకి వెళ్లి జీమెయిల్‌కు లాగిన్‌ కావాలి. తరువాత ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాలి. అందులో పైన ఎడమవైపు చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేస్తే మొదటి పేజీలో ఉన్న 50 మెయిల్స్‌ సెలెక్ట్‌ అవుతాయి. ఇప్పుడు డిలీట్‌ ఐకాన్‌పై నొక్కితే ఈ పేజీలోని 50 మెయిల్స్‌ మాత్రమే డిలీట్‌ అవుతాయి. కానీ అన్ని పేజీల్లో ఉన్న మెయిల్స్‌ డిలీట్‌ కావు.

జీమెయిల్‌ నిండిపోయిందా.. ఖాళీ చేయండిలా ఇందు కోసం ఇప్పుడు పైన ‘సెలెక్ట్‌ ఆల్‌ కన్వర్వేషన్స్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎంచుకుంటే అన్ని మెసేజ్‌లు సెలెక్ట్‌ అవుతాయి.ఇప్పుడు డిలీట్‌ ఐకాన్‌ నొక్కితే అన్ని మెయిల్స్‌ ట్రాష్‌లోకి వెళ్లిపోతాయి.ఎంచుకున్న విభాగాల్లోనే జీమెయిల్‌ నిండిపోయిందా.. ఖాళీ చేయండిలా ఇలా కాకుండా ప్రత్యేకంగా కొన్ని విభాగాలను మాత్రమే డిలీట్‌ చేయాలనుకుంటే ఇన్‌బాక్స్‌లో పైన ఎడమ వైపు ఉన్న చెక్‌బాక్స్‌పై ‘డౌన్‌ యారో’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు రీడ్‌, అన్‌రీడ్‌, స్టార్డ్‌, అన్‌స్టార్డ్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకదానిపై క్లిక్‌ చేసి, తరువాత ఇంతకు ముందు లాగే ‘సెలెక్ట్‌ ఆల్‌ కన్వర్వేషన్స్‌’ ఎంచుకోవాలి.

ప్రమోషన్‌, సోషల్‌ మెయిల్స్‌ సాధారణంగా మన జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ యాడ్లు, ప్రమోషన్లు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ల మెయిల్స్‌తో నిండిపోతుంది. వీటిని డిలీట్‌ చేసేందుకు మొదట ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాలి. పైన ప్రమోషన్‌, సోషల్‌ మెయిల్‌లకు సంబంధించిన ఫోల్డర్‌లు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవాలి. తరువాత ఇంతకు ముందు లాగే పైన ఎడమ వైపు ఉన్న చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో మొదటి 50 మెయిల్స్‌ సెలెక్ట్‌ అవుతాయి. తరువాత పైన ‘సెలెక్ట్‌ ఆల్‌ కన్వర్సేషన్స్’ ఆప్షన్‌ ఎంచుకుంటే అన్ని మెయిల్స్‌ సెలెక్ట్‌ అవుతాయి. తరువాత డిలీట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. పై మూడు విధానాల్లో డిలీట్‌ చేసిన మెయిల్స్‌ ట్రాష్‌ ఫోల్డర్‌లో 30రోజులు ఉంటాయి. వాటిని పూర్తిగా డిలీట్‌ చేయాలనుకుంటే ఈ 30రోజుల్లోగా ట్రాష్‌ ఫోల్డర్‌లో డిలీట్‌ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -