టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఆన్లైన్ మోసాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్పామ్ కాల్స్, మెసేజ్ ల ద్వారా అమాయకుల నుంచి డబ్బును లూటీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు ఎక్కువ శాతం స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్ ల ద్వారానే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేసుకునేందుకు చాలమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ను కూడా ఉపయోగిస్తుంటారు. ఇలా థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ నేపథ్యం స్పామ్ కాల్స్ లేదా మెసేజ్ లను అరికట్టేందుకు గవర్నమెంట్ ఒక సరికొత్త యాప్ ను ప్రవేశ పెట్టింది. ఆ యాప్ ఏమిటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ). ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత అక్కడ ఆప్షన్ లో ఉన్న డీఎన్డీ కి మొబైల్ నెంబర్ ను జోడించాలి. ఆ తర్వాత ఎటువంటి నిర్దేశిత కాల్స్ లేదా మెసేజ్ లనే బ్లాక్ చేయాలా ? లేదా అన్ని రకాల స్పామ్ కాల్స్, మెసేజ్ లను బ్లాక్ చేయాలా ? అని ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన విధంగా అన్ని రకాల స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేయాలనుకుంటే అన్నిటినీ బ్లాక్ చేయవచ్చు. ఆ తర్వాత నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ రావడం జరగదు. ఇంకా ఇందులో మన ఆదార్ నెంబర్ తో మనకు తెలియకుండా ఉన్న ఇతర నెంబర్స్ ను కూడా బ్లాక్ చేసే వీలు ఉంటుంది. కాబట్టి ( TRAI ) యాప్ ద్వారా చాలావరకు ఆన్లైన్ మోసలను అరికట్టవచ్చు.
Also Read:రామ మందిర్.. ఎన్నికల వ్యూహమేనా?