ఆరు గ్యారెంటీలకు.. ఇలా అప్లై చేయండి!

56
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీ హామీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆరు పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు ఫారంలో అప్లై చేసుకునేలా వీలు కల్పించింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. యువ వికాసం మినహా మిగిలిన అయిదు హామీలను అర్హులైన వారందరికి అందించేలా తెలంగాణ ప్రభుత్వం చర్చలు తీసుకుంటోంది.

తాజాగా సచివాలయంలో ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫారంను విడుదల చేశారు సి‌ఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సి‌ఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సి‌ఎం భట్టి విర్కమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని సి‌ఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

అప్లై చేయు విధానం
మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, గృహలక్ష్మి పథకాలన్నిటికీ కలిపి ఒకే దరఖాస్తులో ఈ నెల 28 నుంచి అప్లై చేసుకోవచ్చని సి‌ఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నెల 28 నుంచి ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుందని, జనవరి 7 వరకు అప్లై చేసుకోవచ్చని అన్నారు సి‌ఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో భాగంగా ఎనిమిది పని రోజుల్లో గ్రామ సభల ద్వారా మండల తహసీల్దార్ ఆద్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని సి‌ఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు..

- Advertisement -