ఇటీవల ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ మిస్ అయ్యారా.. మరలా ఓటుగా నమోదు చేసుకొనే ఛాన్స్ రాదా ? అంటూ చింతిస్తున్నారా ? అలా చింతించాల్సినవసరం లేదు. మరోసారి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం డిసెంబర్ 26వ తేదీ నుండి ప్రారంభం కానుంది. భారత ఎన్నికల వ్యవస్థ 18 సంవత్సరాలు నిండినవారికి ఓటు హక్కు కల్పించింది. నిర్దేశిత వయసు దాటిన ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం కోసం ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఏటా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది ఎన్నికల కమిషన్.
అయితే ఓటు ఉన్న వారు కూడా వారి విలువైన ఓటును కొన్ని సార్లు వినియోగించుకోలేకపోతున్నారు.. ఓటు హక్కు ఎలా సాధించుకోవాలా?, ఓటు ఇతర ప్రాంతాల నుండి ఎలా మార్చుకోవాలి?, విదేశాలలో ఉన్న వారు తమ ఓటును ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఓటరు కార్డులో తప్పులు ఎలా సవరణ చేసుకోవాలి?.. ఇలాంటి వాటికి ఏ దరఖాస్తు చేసుకోవాలి.. అనేవి సందేహాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు పారిష్కారంగా ఎలక్షన్ కమీషన్ ఏ దరఖాస్తును దేనికి ఉపయోగించాలో తెలుపుతోంది.
1.ఫారం -6: 2019 జనవరి 1నాటికి 18 సంవత్పరాలు నిండిన వారెవరైనా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఫారం-6ను భర్తీ చేయాలి. అంతేకాదు ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గంకు ఓటును మార్చుకోవాలన్న వారికి కూడా ఈ ఫారమే ఉపయోగించుకోవాలి.
2.పారం -6ఎ: విదేశాలో ఉంటున్న భారతీయ పౌరులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలంటే ఈ దరఖాస్తును పూర్తి చేయాలి. ప్రత్యేక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా పోస్టు ద్వారానైనా ఈ ఫారాన్ని నింపి పంపవచ్చు.
3. ఫారం -7: ఓటర్ల జాబితా నుండి పేరు తోలగించుకొనేందుకు ఈ దరఖాస్తును పూర్తి చేయాలి.
4. ఫారం -8: ఓటు హక్కు ఉండి, సవరణలు చేసుకునేందుకు ఈ దరఖాస్తును ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డు పేరు, వయస్సు, బంధుత్వం, ఫోటోల్లో తప్పులు ఉంటే ఈ ఫారంతో సవరణ చేసుకోవచ్చు.
5.ఫారం -8ఏ: ఓటు ఉన్న నియోజకవర్గ పరిధిలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఇల్లు మారినప్పుడు చిరునామా మార్పు కోసం ఈ దరఖాస్తు ఉపయోగించుకోవచ్చు.
ఓటరు నమోదు కొరకు ఈ వెబ్ సైట్స్ చూడండి:
http://ceotelangana.nic.in/
http://eci.nic.in/OverseasVoters/home.html