`విన‌య విధేయ రామ` ప్రీ రిలీజ్..చీఫ్‌గెస్ట్‌గా చిరు..

247
Ram Charan
- Advertisement -

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్నతాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. కైరా అడ్వాణీ కథానాయిక. ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, ఆర్యన్‌ రాజేష్‌, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మాత. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ సోష‌ల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేష‌న్ క్రియెట్ చేశాయి.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 27న యూస‌ప్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ ప్ర‌ముఖులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు.

Ram Charan

ఈ సంద‌ర్బంగా… నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – `మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో `విన‌య‌విధేయ‌రామ‌` సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి అంచ‌నాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఈ నెల 27న హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ ప్ర‌ముఖులు, మెగాభిమానులు, ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ లెవ‌ల్లో నిర్వ‌హించ‌బోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సంక్రాంతి కానుక‌గా సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

- Advertisement -