సూపర్ మెన్ ఫోజ్…ఎన్ని లాభాలో!

69
- Advertisement -

ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ ఎంతైన అవసరం. అయితే మితిమీరిన కసరత్తులు చేయకుండా చిన్న చిన్న భంగిమలతోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొండడానికి యోగా ఒక చక్కటి పరిష్కారంలా ఉంటుంది. యోగాలో ప్రతిఆసనం ఒక నిర్ధిష్ట ఆరోగ్య ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. చాలా ఈజీగా ఎవరైనా వేయగలిగే యోగా ఆసనాలలో విపరీత సలభాసనం ( సూపర్ మెన్ ఫోజ్ ) కూడా ఒకటి. ఈ ఆసనం ప్రతిరోజూ వేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల సూపర్ మెన్ ఫోజ్ ఎలా వేయాలి.. ఈ ఫోజ్ వల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం..!

సూపర్ మెన్ ఫోజ్ వేయు విధానం
ముందుగా చదునైన నేలపై బోర్లా పడుకోవాలి. చేతులను ముందుకు చాచి రెండు కాళ్ళను ఒకదానికొకటి దగ్గరగా ఉంచుకోవాలి. ఆ తరువాత శ్వాస తీసుకొని పొట్టపై భారం మోపుతూ కాళ్ళను మరియు చేతులను కొద్దిగా ఫోటోలో చూపిన విధంగా పైకి లేపాలి. ఆ తరువాత వీలైతే పైకి లేపిన కాళ్ళ మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసేటప్పుడు శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి.

లాభాలు
ఈ సూపర్ మెన్ ఫోజ్ వేయడం వల్ల కాళ్ళు మరియు చేతులు సాగదితకు గురౌతాయి. అంతే కాకుండా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఉదర భాగంలోని కొవ్వు మరియు తొడల భాగంలోని పెరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఈ సూపర్ మెన్ ఫోజ్ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోజ్ ప్రతిరోజూ 10 నుంచి 15 నిముషాల పాటు వేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా దూరమౌతాయి. ముఖ్యంగా కాళ్ళ నుంచి తల వరకు అన్నీ భాగాలకు రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలు ఈ సూపర్ మెన్ ఫోజ్ తప్పనిసరిగా వేయాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:బీజేపీ ఖాతాలోకి సూరత్..ఏకగ్రీవం!

- Advertisement -