మోడీ సర్కార్ గట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లు రద్దు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారికంగా ప్రకటించే వరకు విషయం కాస్త కూడా, లీక్ కాలేదంటే మోడీ పాలనా దక్షత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఒక వారంలోనో, నెలలోనో జరిగింది కాదు. దాదాపు ఆర్నెళ్ల కిందనే నోట్ల రద్దుకు బీజం పడింది. ప్రధాని మోడీ, ఆయన ముఖ్య కార్యదర్శి తొలిసారి ఆర్నేళ్ల కింద నోట్లపై చర్చించారట. ఆ తరువాత ఈ విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కు చెప్పారట. ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న ఆర్థికవేత్తల్లోమాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఒకరు. కానీ, మోడీ నిర్ణయాన్ని ఆయన వ్యతికించారని తెలుస్తోంది. అయితే కేంద్రం నోట్ల రద్దు ఖచ్చింతంగా అమలు చేయాలని భావించింది. ఈ క్రమంలోనే రాజన్ మళ్లీ గవర్నర్ గా కొనసాగేందుకు విముఖత చూపించినట్లు తెలుస్తోంది.
ఆ తరువాత ఈ వ్యవహారం ఆర్థిక శాఖతో మడిపడి ఉండడంతో మూడు నెలల క్రితం అరుణ్ జైట్లీతో దీనిపై చర్చించారట. అలా నోట్ల రద్దు వ్యవహారం ముందుకు కదిలింది. ఆతరువాత జైట్లీ వెంటనే ఓ ఇద్దరు నమ్మకస్తులైన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు పని అప్పగించారట. అప్పటి నుంచి నోట్ల రద్దు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్రం.. నవంబర్ 8న అధికారికంగా ఈ ప్రకటన చేసింది. ఈ మొత్తం ప్రక్రియలో రాజన్ భాగస్వామ్యం కూడా ఉన్నా.. జరుగబోయే పరిణామాలు గుర్తించి పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తరవాత ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఉర్ధివ్‌సాయంతో కేంద్రం నోట్ల రద్దుకు సబంధించి మిగిలిన కార్యక్రమం పూర్తి చేసింది.