ఆ ఆస్తులు ఎలా వచ్చాయి అషురెడ్డి ?

38
- Advertisement -

అషురెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్స్ ద్వారా కుర్రకారుకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కబాలి చిత్రం నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టు పడ్డాడు. అయితే కేపీ బుల్లితెర అషు రెడ్డితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు. అషు రెడ్డికి డ్రగ్స్ గ్యాంగ్ తో పరిచయాలు ఉన్నాయా ? అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసుపై నటి ఆషురెడ్డి స్పందించింది.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డ్రగ్స్ కేసులోకి నన్ను లాగొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్‌కు సంబంధించి ఎవరితో కాంటాక్ట్ లేవని, తనపై వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయే అర్థం కావట్లేదని అషురెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ఐతే, ఇటీవల ఆమెకు డ్రగ్స్ కేసు నిందితుల నుంచి కాల్స్ వచ్చాయని అధరాలు ఉన్నాయట. మరి ఏ సంబంధం లేకపోతే అన్నీ కాల్స్ ఎందుకు వస్తాయి ?

Also Read: భోళాశంకర్ నుంచి బిగ్ అప్ డేట్

పైగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరితో అషురెడ్డి చాలా క్లోజ్ గా కూడా మూవ్ అయ్యేది అని టాక్. దానికి తగ్గట్టుగానే కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో అషురెడ్డి పేరు ఉందట. మొత్తం బయట పడ్డాక, డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఏ సంబంధం లేదని, ఆరోపణల్లో నిజం లేదని, అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని అషురెడ్డి చెప్పడం కామెడీగా ఉంది. అసలు అషురెడ్డి పెద్దగా సినిమాలు కూడా చేయలేదు. కానీ ఆమె పేరిట బాగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. మరి అవన్నీ ఎలా వచ్చాయి అషురెడ్డి ?

Also Read: KeedaaCola:నాయుడిగా తరుణ్‌భాస్కర్‌

- Advertisement -