- Advertisement -
భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు కొంతమంది…..ఇంకొంతమంది పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే వారు ఉన్న ఈ లోకంలో ఆయన సమ్ థింగ్ స్పెషల్.
గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారో పెద్దాయన.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు.
తన భార్య జ్ఞాపకంగా ఏకంగా మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ప్రేమను చాటుకున్నారు. చెప్తే గానీ తెలిసేలా లేదు ఆమె కాదు అది విగ్రహమని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో. ఈ అద్భుతాన్ని సృష్టించిన కళాకారులకు సలాం చేయాల్సిందే.
- Advertisement -