స‌న్నీలియోన్ రేటెంతో తెలుసా !

222
Rajashekar-Sunny Leone
- Advertisement -

రాజశేఖర్- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ ‘ఎస్వీ గరుడవేగ’. ఇందులో సన్నీలియోన్ రూరల్ అమ్మాయిగానే కాకుండా, స్పెషల్‌గా ఓ సాంగ్ చేస్తోంది. రీసెంట్‌గా ముంబైలో స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్స్‌లో సాంగ్‌ని చిత్రీకరించారు. సన్నీ సినిమాలంటే చెప్పనక్కర్లేదు.. యూత్‌కి ఆనందం అంతా ఇంతా కాదు. కథను మలుపుతిప్పే ఎపిసోడ్ లో ఆ పాటను అందంగా తెరకెక్కించారట చిత్ర యూనిట్. 60 మంది డ్యాన్సర్స్ తో  కొరియో గ్రాఫర్ విష్ణు దేవా నేతృత్వంలో చిత్రీకరణను జరుపుతున్నారట.

sunnyleone-psvgarudavega-firstlook

ముంబై లో వేసిన ఓ భారీ సెట్ లోఈ పాట షూటింగ్ జరుగుతోంది. బెంగాల్ టైగర్ సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ ఆ పాటను కంపోస్ చేస్తున్నాడు. డియో డియో అని మొదల్లవ్వనున్న ఈ సాంగ్ లో సన్నీ చాలా కొత్తగా కనిపించనుందట. ఎప్పుడు కనిపించని విధంగా స్పైసి డ్రెసులతో చాలా గ్లామర్ గా కనిపించనుందని టాక్. గరుడ వేగ సినిమా కోసం సన్నీలియోన్ కు 50లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని తెలుస్తోంది. సన్నీలియోన్ క్రేజ్ అలాంటిది మరి. అలా అని ఖర్చు అక్కడితో ఆగలేదు. ముంబాయిలో సెట్ వేయడం, అక్కడ వంద మంది డ్యాన్సర్లను తీసుకోవడం తప్పలేదు. దాంతో మళ్లీ అదో అదనపు ఖర్చు. యాభై లక్షలు బిల్లు. సో, టోటల్ గా రాజశేఖర్ హీరోగా నటిస్తున్న గరుడ వేగ సినిమాలో సన్నిలియోన్ అయిటమ్ పాటకు ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు అన్నమాట.

Sunny-Leone

ఇప్పటి దాకా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, తొలిసారి కాస్త భారీ సినిమాను తలకెత్తుకున్నాడు. కాస్త యాక్షన్ ప్లస్ టెక్నాలజీ బ్యాక్ గ్రవుండ్ సినిమా కావడంతో ఖర్చు బాగానే అవుతోంది. దానికి ఈ అయిటమ్ కోటి అదనం అన్నమాట.

- Advertisement -