ప్రస్తుతం హీరోయిన్ల పై మార్ఫింగ్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో తాను ఉన్నాను అంటుంది నిహారిక కొణిదెల. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ మెగా డాటర్, ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ వీడియోలతో కెరీర్ నెట్టుకొస్తోంది. అయితే, నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్షర్స్ పేరుతో నిహారిక కొణిదెల ఒక నిర్మాణ సంస్థ స్థాపించింది. ఆ బ్యానర్ పై మొదటి మూవీ స్టార్ట్ అవుతోంది. ఈ క్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘కొందరు మగవాళ్ళు అమ్మాయిలను ఏదో బొమ్మ అనుకుంటారు. అందుకే, వాళ్ళ శరీర భాగాలను జూమ్ చేసి, వాటికి రకరకాల పేర్లు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడతారు అని చెప్పుకొచ్చింది.
అయినా, ఇలాంటి పైశాచిక ఆనందం పొందే వారు చాలామంది ఉన్నారు. ఈ రోజు ఏదో రష్మిక ఫెక్ వీడియో వచ్చింది కాబట్టి, అందరూ రియాక్ట్ అవుతున్నారు. అసలు సాధారణంగా ఏదైనా ఈవెంట్ కి హీరోయిన్లు అలాగే లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అటెండ్ అయినా.. అక్కడ వంగినప్పుడో, పక్కకు జరిగినప్పుడో ఆ ఫోటోలను జూమ్ చేసి ప్రత్యేకంగా కొన్ని శరీర భాగాలకు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తారు. గతంలో టబు దగ్గర నుంచి నేటి శ్రీలీల వరకూ ఇలాంటి ఎన్నో ఇబ్బందులను పడిన వారే. దీనికితోడు ప్రస్తుతం ఏఐ సాంకేతిక కారణంగా ఆకతాయి కూడా హీరోయిన్ల ఫేస్ లు మార్చేస్తున్నాడు.
ఇది ఇలాగే కొనసాగితే.. మన ఇంట్లో ఆడవాళ్లు కూడా ప్రశాంతంగా జీవించలేరు. నిజమే, ఈ దుష్ట పద్ధతి మారాలి. ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడే హీరోయిన్లకు కనీస మర్యాద ఉంటుంది. అంతెందుకు, సోషల్ మీడియాలో హీరోయిన్లను కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చెయ్యరు చాలా మంది. ఐతే, ఇక్కడ కొందరు హీరోయిన్ల తప్పు కూడా ఉంది. తమ శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూపిస్తారు. మార్పు అనేది రావాలి అంటే.. ముందు బాధితులు కూడా మారాలి. అప్పుడే నేరస్థులు భయపడతారు.
Also Read:కొడం’గల్’.. రేవంత్ ‘నిల్’!