డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా చెబుతుండటం చూస్తున్నాం. అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా గుర్మీత్ సింగ్, అతనితో అసంబద్ద సంబంధమున్న హనీప్రీత్ జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం రాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హనీప్రీత్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్‌కు డేరా బాబాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడిస్తోంది. ‘ఎ డైలాగ్ విత్ జేసీ’ అనే చాట్‌షోలో రాఖీ.. హనీప్రీత్ గురించి షాకింగ్ విషయాలు భయట పెట్టింది. గుర్మీత్‌ను కలుస్తానంటే హనీప్రీత్ ఒప్పుకునేది కాదని, ఎక్కడ గుర్మీత్‌ను పెళ్లి చేసుకుంటానోనని తనని దూరంగా పెట్టేదని పేర్కొంది.
తనకు మూడేళ్లుగా గుర్మీత్, హనీప్రీత్‌తో పరిచయం ఉందని.. చాలా సార్లు వాళ్లని కలిశానని తెలిపింది రాఖీ. ఓసారి గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా రాఖీని డేరా ఆశ్రమానికి ఆహ్వానించగా.. అది హనీప్రీత్‌కు నచ్చేదలేంది. ఎక్కడ గుర్మీత్‌ను పెళ్లి చేసుకుంటానోనని తనను దూరం పెట్టేదన్న రాఖీ సావంత్.. గుర్మీత్ ఇలా ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని మగవారిని నపుంసకుల్ని చేస్తాడని నేను అసలు వూహించలేదని వెల్లడించింది రాఖీ. అయితే డేరాబాబా అకృత్యాలపై ఇప్పటివరకు నోరు మెదపని రాఖీ సావంత్.. ఇప్పుడు కథలు కథలుగా చెప్పడాన్ని చూస్తుంటే తన సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ చేసుకోవడానికేనా.. లేదా నిజంగానే.. రాఖీకి డేరాబాబాకు సంబంధాలున్నాయా అన్న సంగతి తెలియాల్సి ఉంది.