డేరా సచ్ఛా సౌధా బాబా గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ దత్తపుత్రిక హనీప్రీత్ పరారిలో ఉన్న విషయం తెలిసిందే. డేరా బాబాను అత్యాచారం కేసుల్లో దోషిగా తేల్చి, సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న హనీప్రీత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.
ప్రస్తుతం హనీప్రీత్ ను సీబీఐ గాలిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హనీప్రీత్ నేపాల్ లో దాక్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని సీబీఐ ధ్రువీకరించలేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా హనీప్రీత్ కి జిమ్ ట్రైనర్ చేసిన ఒక మహిళా భక్తురాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హనీప్రీత్ కు శారీరక వ్యాయామం విషయంలో శిక్షణను ఇచ్చేదట. డేరా ఆశ్రమంలోనే ఈ భక్తురాలు కూడా ఉండేది. హనీప్రీత్ – డేరాబాబా బంధం గురించి ఈమె వివరించింది. బాబా, హనీప్రీత్ లు చాలా సన్నిహితంగా ఉండేవారని, వాళ్లిద్దరూ ఒకే గదిలో ఉండే వాళ్లని ఈ భక్తురాలు చెప్పింది. ఆశ్రమంలో ఉన్నా, బయటకు ఎక్కడికైనా వెళ్లినా.. వాళ్లిద్దరూ జంటగా ఉండేవాళ్లని వివరించింది.
హనీప్రీత్, గుర్మీత్ ల మధ్య శారీరక సంబంధం ఉందని ఇది వరకూ హనీప్రీత్ మాజీ భర్త ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే..డేరా ఆశ్రమంలోని భక్తురాలు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక అందాన్ని కాపాడుకోవడానికి హనీప్రీత్ తీవ్రంగా శ్రమించేదని ఈ భక్తురాలు చెప్పడం గమనార్హం. బాడీ ఫిట్ నెస్ ను కాపాడుకుని, అందంగా కనిపించాలని హనీప్రీత్ కోరుకునేదని, ఈ విషయంలో ఆమెకు బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ ఆదర్శమని చెప్పింది.
కత్రినాలా ఫిట్ గా కనిపించాలని, అందంగా కనిపించాలని.. అందుకోసం హనీప్రీత్ రోజుకు మూడు గంటల సేపు వ్యాయామం చేసేదని వివరించింది. ఆశ్రమంలో హనీప్రీత్ కి ప్రత్యేకంగా ఒక జిమ్ ఉండేదని పేర్కొంది. అంతేకాకుండా కత్రినాను ఫాలో అయ్యే హనీప్రీత్ ‘ధూమ్-3’లో పాటకు కత్రినా డాన్స్ చేసినట్టుగా.. హనీప్రీత్ అనుకరిస్తూ స్టెప్పులేసేదని కూడా ఆ మహిళా భక్తురాలు చెప్పుకొచ్చింది.