తేనెతో గుండెపోటు కు చెక్!

42
- Advertisement -

తేనె ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాలలో ఒకటి. రుచిలో మధురంగా ఉండే తేనెను తినడానికి ప్రతిఒక్కరు ఎంతో ఇష్టపడతారు. తేనె సహజసిద్దంగానే ఎన్నో ఔషధ గుణాలను కలిగిఉంటుంది. ఆయుర్వేదంలో తేనెను దివ్యఔషధంగా చెప్పుకుంటారు. తేనెలో యాంటీసెఫ్టిక్, యాంటీ బయోటిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఉపయోగ పడతాయి. ఇవే కాకుండా తేనెలో విటమిన్ బి1, విటమిన్ బి6 వంటి పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ తేనె తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి అవేంటో తెలుసుకుందాం !

కఫం, ఉబుసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవాళ్ళు తేనె తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయట. ప్రతిరోజూ వేడి వేడి పాలలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల శరీర నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇక రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాసు పాలలో తేనె కలిపి తాగితే నిద్రలేమి సమస్య దూరమై గాఢనిద్ర పడుతుంది. ఇక ప్రతిరోజూ నిమ్మరసంతో పాటు తేనె కలిపి తాగితే ఊబకాయం వంటి సమస్యలు దూరం అవుతాయి. అందువల్ల వేగంగా బరువు తగ్గవచ్చు.

Also Read: మళ్ళీ మొదలెట్టిన బీజేపీ?

ఇక గోరువెచ్చని నీటిలో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే పడగడుపున తాగడం వల్ల శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుందట. అన్నిటికిమించి గుండెపోటు డయాబెటిస్ వంటి వ్యాధులు దారిచేరకుండా నివారించడంలో తేనె అద్బుత ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. తేనెలో ఉండే యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండెపోటు రాకుండా చేయడంలో ఉపయోగ పడతాయట. అందువల్ల నేటిరోజుల్లో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడే తేనెను ప్రతిరోజూ తగినంతా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: టీడీపీ కోసమే పురందేశ్వరి ప్రయత్నామా?

- Advertisement -