దోమకొండ సంస్థాన వారసుడు కామినేని ఉమాపతిరావు (రిటైర్టు ఐఏఎస్ అధికారి) బుధవారం మృతిచెందగా, ఈ ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గడికోట లక్ష్మీబాగ్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమం కోసం మెగా ఫ్యామిలీ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన.. ఇతర బంధువులు హాజరయ్యారు. ఉమాపతిరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చిరు కుటుంబం.
అయితే గడికోట నివాసం నుంచి ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై చిరంజీవి, రామ్ చరణ్ లను ఇంట్లోకి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాసేపటికి తేనెటీగలు శాంతించడంతో అంత్యక్రియలు యథావిధిగా జరిగాయి. ఈ అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే హజరైయ్యారు.