ఇంట్లోనే నేచురల్ హెయిర్ ప్యాక్స్!

3
- Advertisement -

తెల్ల జుట్టు అనేది ఏ వయసు వారికైనా సాధారణ సమస్యగా మారిపోయింది. పూర్వంలో వృద్దప్య వయసులో మాత్రమే కనిపించే తెల్లజుట్టు ఇప్పుడు యుక్త వయసు వారిలో కూడా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే పదేళ్ళ లోపు పిల్లలను కూడా ఈ తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది.

అయితే ఇంట్లోనే తయారు చేసుకునే నేచురల్ హెయిర్ ప్యాక్స్‌ వల్ల జుట్టును గట్టిగా ఉంచుకోవచ్చు. పెరుగు పొట్టకే కాదు.. జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. అరకప్పు చొప్పున పెరుగు, తేనె, ఒక చెంచా బాదం నూనె తీసుకొని అన్నింటినీ బాగా కలపాలి. ఆపై ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి ఆ తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టుకు సంబందించిన ఎలాంటి సమస్యలకైనా కరివేపాకు చక్కగా పని చేస్తుంది. కరివేపాకులో విటమిన్ ఏ మరియు సి వంటి వాటితో పాటు బి6, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును కుదుళ్ల వరకు బలంగా ఉంచడంలో సహాయ పడతాయి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

మందార పూల రేకుల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని మెత్తగా చేసి దానికి ఆలివ్‌నూనెని జత చేసి మాడుకి అప్లై చేయాలి. గంటసేపు అలా ఉంచి ఆపై శుభ్రంగా నీటితో కడిగేయాలి. ఇలా చేయడం కేశాలు మెత్తబడటమే కాక మెరుపును కూడా సంతరించు కుంటాయంటున్నారు నిపుణులు.

Also Read:బీఆర్ఎస్ పాలన..తెలంగాణ ప్రగతికి బాటలు

జుట్టుకు బలాన్ని పెంచడంలో సొరకాయలో ఉండే పోషకాలు కూడా ఎంతగానో ఉపయోగ పడతాయి. తాజా సొరకాయను పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వారం రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. ఆ తరువాత ఒక పాత్రలో కొబ్బరినూనె తీసుకొని అందులో ఈ ఎండు సొరకాయ ముక్కల్ని వేసి మరిగించాలి. నూనె చల్లారిన తరువాత వడబోసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు జుట్టుకు అప్లై చేసుకొని ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మరి బలంగా తయారవుతుంది.

- Advertisement -