ఇంటి భోజనం..ఆఫీస్‌కు డెలివరీ

63
- Advertisement -

పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఒక్క క్లిక్‌తో మనకు కావాల్సిన సరుకులు మనముందు ఉంటున్నాయి. కురగాయాలు,బట్టలు, ఇతర వస్తువులే కాదు మెడిసిన్​ఇలా ప్రతి వస్తువు మన ఇంటిముందు వాలిపోతున్నాయి. వివిధ రకాల ఆఫర్లు ఉంటుండడంతోపాటు, ఇంటి నుంచి కాలు బయటపెట్టే అవసరం లేకపోవడంతో ఆన్​లైన్ ​మార్కెట్ ను ఉపయోగించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

దీంతో ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్‌‌ వంటి వాటి తరహాలో డోంజో, బ్లింక్‌‌ఇట్, జెప్టో, ఇన్‌‌స్టా మార్ట్‌‌, హైదరాబాద్ ట్రాలీ ఇలా ఫుడ్, గ్రాసరీ రిలేటెడ్ యాప్‌‌లు అందుబాటులోకి వచ్చాయి. సిటీతోపాటు శివారు ప్రాంతాలకు సేవలను విస్తరించడంతో డోర్ డెలివరీ జాబ్స్‌కి డిమాండ్ పెరిగిపోయింది.

ఇక తాజాగా డోర్ డెలివరీలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు ఆఫీస్‌కు లంచ్‌ బాక్స్ తీసుకెళ్లలేకపోతే రెస్టారెంట్ల నుండి తెప్పించుకుని బాగున్నా లేకపోయినా తప్పక తినేవారు. ఇంటి భోజనాన్ని మిస్ అవుతున్నామని ఎక్కడో ఓ ఫీలింగ్ ఉన్న తప్పని పరిస్థితి. ఇదివరకైతే ఉదయం తమతో పాటే లంచ్‌ బాక్స్‌లను ఆఫీసులకు తీసుకెళ్లేవారు. అయితే కొన్ని సమయాభావ కారణాల వల్ల ఆఫీస్‌కు లేటు అవుతుందనో ఇంట్లో వారు ఎంతో ఇష్టంగా వండిన తీసుకెళ్లలేని పరిస్థితి. ఇకపై దీనికి చెక్‌.

ఇంట్లో వేడివేడిగా వండిన ఫుడ్‌ని నిమిషాల్లో డెలివరీ చేసే యాప్స్ వచ్చేశాయి. దీంతో ఇప్పుడు లంచ్ సమయానికి వేడివేడి భోజనాన్ని ఇంటి నుండి తెప్పించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముంబైలో ఇప్పటికే ఈ సర్వీసులు అందుబాటులో ఉండగా ప్రతీరోజు లక్షల్లో లంచ్‌ బాక్స్‌లు ఆఫీస్‌లకు చేరుతున్నాయి. ఇప్పుడు ఈ కల్చర్ హైదరాబాద్‌లో కూడా ప్రారంభమైంది. పలు యాప్స్‌ల సాయంతో మధ్యాహ్నం ఇంటి నుండి భోజనాన్ని ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయిందని దీంతో తమకు మరింత ఉపాధి దొరుకుతుందని డెలివరీ బాయ్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -