ప్రచార రథాన్ని కాపీకొట్టిన పవన్‌!

171
pawan
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు జనసేనాని పవన్. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే దూకుడు పెంచిన పవన్‌…వచ్చే ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే మంచి పాలన అంటే ఏంటో చూపిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ముందుకుసాగుతున్నారు.

ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే స్కార్పియో కాన్వాయ్‌తో ముందుకుసాగుతున్న పవన్‌…తాజాగా ఎన్నికల ప్రచార రథాన్ని రెడీ చేయిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. గతంలో ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి బస్సు యాత్ర అత్యంత కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బస్సు యాత్ర అని కాపీ కొడుతున్నారు.

బస్సు యాత్రను మాత్రమే కాపీ కొట్టకుండా ఎన్టీఆర్ ఉపయోగించిన బస్సు నమూనాను పోలీ ఉంది. ఆ బస్సు ను చూస్తుంటే దాదాపు 80% ఎన్టీఆర్ చేసిన బస్సు యాత్ర తాలూకు బస్సు పోలికలను కలిగి ఉంది. దీంతో పవన్‌ ప్రచార రథంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ ప్రచార రథానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే లెజెండ్ ఎన్టీఆర్ లాగా పవన్ కళ్యాణ్ కు కూడా అధికారంలోకి వస్తారో లేదో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -