హైటెక్‌సిటీ – రాయదుర్గం మెట్రో ప్రారంభం.

586
ktr
- Advertisement -

ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో  అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ- రాయదుర్గం మధ్య మెట్రోను జెండా ఊపి ప్రారంభించారు మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్‌. ఈ సందర్భంగా మెట్రోలో రాయదుర్గం వరకు ప్రయాణించారు. ఐటీ కారీడార్ లో మెట్రో పరుగులు పెట్టడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మైండ్ స్పెస్ జంక్షన్ వరకు రైలు అందుబాటులోకి రావడం ద్వారా ఇనార్బీట్ మాల్ మార్గంలో ఐటి కంపనీలకు ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు.

కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా ఈ మార్గం అందుబాటులోకి రావడంతో కారిడార్ త్రీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అయింది.

The much-awaited Mindspace Metro station near the Mindspace junction has been inagurated by ktr today. Hyderabad Metro services to Mindspace junction starts today

- Advertisement -