ఒక్క ప్లాప్ ఓడల్ని బండ్లు చేస్తోంది. ఒక్క హిట్ బండ్లను ఓడలను చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడెవరికి డిమాండ్ వస్తుందో, ఎవరి డిమాండ్ ఎప్పుడు పడిపోతుందో అంచనా వేయడం నిజంగా కష్టమే. అందుకే, సినీ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ బాక్సాఫీస్ దగ్గర తలకిందులు అవుతుంటాయి. ఈ రోజు రిలీజ్ అయిన హిట్ 2 సినిమా దర్శకుడు డా. శైలేష్ కొలను రేంజ్ మారింది. ఆయనకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రసన్నకుమార్ బెజవాడ ఆ మధ్య నాగార్జునకు ఒక కథ చెప్పాడు. ఆ కథ నాగార్జునకు చాలా బాగా నచ్చింది. కానీ, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అయితేనే ఆ కథకీ న్యాయం జరుగుతుందని భావించాడు నాగ్. ఈ పరిస్థితుల్లో హిట్ 2 సినిమా వచ్చింది. హిట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రసన్న చెప్పిన కథను శైలేష్ కొలను చేతిలో పెడితే ఎలా ఉంటుంది అని నాగ్ ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున కెరీర్ విపత్కర పరిస్థితుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ తన కెరీర్ ఫామ్ లోకి రావాలంటే.. శైలేష్ కొలను లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ అయితేనే వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వాలంటే.. హిట్ 3 పూర్తి చేయాలి. లేదా శైలేష్ కొలను అటు హిట్ 3, ఇటు నాగ్ సినిమాని..రెండు సమాంతరంగా చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి…