నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని 32వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రీ-క్లైమాక్స్‌లోని ట్విస్ట్‌లు చాలా ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి. కథలోని ముఖ్యమైన ట్విస్ట్ ఈ దశలో వెల్లడి కానుంది మరియు దర్శకుడు శైలేష్ కొలను దీన్ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.
Also Read:తెలంగాణలో వాహనదారులకు షాక్
నాని ఈ చిత్రంలో బీస్ట్ మోడ్ అవతార్‌లో కనిపించనున్నాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నారు.

