ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతీ శుక్రవారం తమిళ డబ్బింగ్ సినిమా రిలీజవుతుంది. ఈ వారం కూడా శేష్ ‘హిట్ 2’ తో పాటు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ‘మట్టి కుస్తీ’ విడుదలవుతోంది. ఈ సినిమాను రవితేజ తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. రవితేజ తెలుగులో రిలీజ్ చేస్తున్న రెండో డబ్బింగ్ సినిమా ఇది. ఇది వరకే విష్ణు విశాల్ నటించిన ‘FIR’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు రవితేజ.
ఇక HIT 2 మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. నాని ఈ సినిమాను సమర్పించడం, సూపర్ హిట్ ‘హిట్’ సిరీస్ నుండి వస్తున్న సెకండ్ కేస్ కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంటుంది. ఇప్పటికే రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే ఈ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడటంతో ఇంకాస్త హైప్ పెరిగింది. అయితే శేష్ కి విష్ణు విశాల్ సమానంగా కాకపోయినా ఓ మోస్తారుగా పోటీ ఇవ్వబోతున్నాడు.
నిజానికి ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జనార్ కి చెందినవి. ఒకటి క్రైం థ్రిల్లర్ అయితే మరొకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఇక డబ్బింగ్ సినిమా అని మట్టి కుస్తీ ని లైట్ తీసుకోలేం. గత వారంలో తమిళ్ డబ్బింగ్ సినిమా ‘లవ్ టుడే’ అల్లరి నరేష్ సినిమాను పక్కకి నెట్టేసి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు మట్టి కుస్తీ ని కూడా తక్కువ అంచనా వేయలేం. అసలే తెలుగు ఆడియన్స్ కంటెంట్ బాగుంటే కాసులు ఇచ్చేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. చూడాలి మరి డబ్బింగ్ సినిమాతో శేష్ ఎలా నెట్టుకొస్తాడో ?
ఇవి కూడా చదవండి..