రివ్యూ : హిప్పీ

957
hippi
- Advertisement -

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉన్న కార్తికేయ ప్రస్తుతం హిప్పీగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. చాలాకాలం తర్వాత జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటించగా టీఎస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో కార్తికేయ మరో హిట్ కొట్టాడా లేదా చూద్దాం…

కథ:

హిప్పీ దేవ‌దాస్ అలియాస్ దేవ (కార్తికేయ‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. ఆముక్త మాల్యద (దిగంగ‌న సూర్యవంశీ)తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తుంటాడు. స్నేహ (జ‌జ్బాసింగ్‌) త‌న‌ని ప్రేమిస్తున్నా, ఆమెను కాద‌ని ఆముక్త మల్యదనే ఇష్టపడతాడు దేవ. అయితే ఆమె చుట్టూ తిరిగేంతవరకు బాగానే ఉంటుంది..ఎప్పుడైతే ఆముక్త మల్యాద..దేవను ఇష్టపడుతుందో అప్పటినుంచి కష్టాలు మొదలవుతాయి. అసలు దేవా పడిన కష్టాలేంటీ..?వీరి ప్రేమకథని అరవింద్(జేడీ చక్రవర్తి) ఎలాంటి మలుపు తిప్పాడు అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫీ,యాక్షన్‌,నేపథ్య సంగీతం,హీరోయిన్ దిగంగన. హిప్పీ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు కార్తికేయ రొమాంటిక్ స‌న్నివేశాల్లో ‘ఆర్ఎక్స్‌100’ని మ‌రోసారి గుర్తు చేశాడు. దిగంగ‌న అందం సినిమాకు మరో హైలైట్‌. ప్రతీ ఫ్రేమ్‌లోనూ అందంగా కనిపించింది. హిప్పీ బాస్ పాత్రలో ఒదిగిపోయాడు జేడీ చక్రవర్తి. తెలంగాణ యాసతో మెప్పించాడు. జ‌జ్బాసింగ్‌, శ్రద్ధా దాస్ ,వెన్నెల‌ కిషోర్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

hippi

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ క‌థ‌, క‌థ‌నం , కామెడీ లేకపోవడం. స‌న్నివేశాల‌న్నీ సాగ‌దీత‌గా అనిపిస్తాయి. కీలక స‌న్నివేశాల్లోనూ కొత్తద‌నం ఏమీ లేదు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపిస్తుంది. నివాస్ కె.ప్రస‌న్న నేప‌థ్య సంగీతం బాగుంది. రాజ‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధాన బ‌లం. ప్రవీణ్ సెకండాఫ్‌లో ఎడిటింగ్‌కి మ‌రింత ప‌దును పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

Image result for hippi

తీర్పు:

ప్రేమిస్తే ఆ అనుభూతి స్వర్గంలోకి వెళ్లిన‌ట్టుగా ఉంటుంది. తిరిగి మ‌న‌ల్ని ప్రేమిస్తే స్వర్గం కోల్పోయిన‌ట్టుగా ఉంటుందనే అంశం చుట్టూ అల్లిన క‌థ ఇది. మొత్తంగా ప్రేమలో గెలిచిన ఓ దేవదాస్‌ కథే…హిప్పీ.

విడుదల తేదీ:06/06/2019
రేటింగ్:2.5/5
నటీనటులు:కార్తికేయ, దిగంగనా సూర్యవంశీ
సంగీతం: నివాస్‌ కే ప్రసన్న
నిర్మాణ సంస్థ: వీ క్రియేషన్స్‌
కదర్శకత్వం: టీఎన్‌ కృష్ణ

- Advertisement -