ఇక మున్సిపల్ పోరు..మోగనున్న ఎన్నికల నగారా..!

538
muncipal elections
- Advertisement -

తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. అసెంబ్లీ ఎన్నికలు,సర్పంచ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ముగియగానే ,ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూన్‌తో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాం ఉంది. కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 134 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

కొత్త మున్సిపల్ చట్టానికి రాజముద్ర వేయించుకోని ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం వార్డుల పునర్విభజన చేపట్టి తర్వాత మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది సర్కార్‌.

మున్సిపల్‌ చైర్మెన్లు, కార్పొరేషన్‌ మేయర్లను నేరుగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రారంభించారు. అధ్యయనం తర్వాత చైర్మన్లు, మేయర్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేలా కొత్త మున్సిపల్‌ చట్టంలో మార్పులు చేయడంతో పాటు ఒకేదశలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -