హిందూపురం టూ అమరావతి..సైకిల్ యాత్ర

11
- Advertisement -

బోయ మంజునాథ్ అనే యువకుడు మహిళల భద్రతకు మద్దతుగా హిందూపురం నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. 14 రోజుల పాటు 726 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన లక్ష్యాన్ని చేరుకున్నారు.

అమరావతిలోని సచివాలయంలో మంజునాథ్, నారా చంద్రబాబు నాయుడు ను కలిసి తన యాత్ర విశేషాలను వివరించారు. మహిళల భద్రత కోసం ప్రజల్లో అవగాహన పెంచడం అవసరమని తెలిపారు.ముఖ్యంగా చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన POCSO Act పై మరింత ప్రచారం, చైతన్యం అవసరమని మంజునాథ్ కోరారు. ఈ చట్టం గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తే నేరాలను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read;డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

మహిళల పట్ల గౌరవంతో, సమాజానికి మంచి సందేశం ఇచ్చిన మంజునాథ్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం మంజునాథ్ కోరిక మేరకు సీఎం స్వయంగా సైకిల్ తొక్కడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సైకిల్ యాత్ర సమాజంలో మంచి చైతన్యాన్ని కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళల భద్రత, గౌరవం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ ఘటన సందేశం ఇస్తోంది.

- Advertisement -