హిందూ పండుగలు –విశిష్టత తెలుసా?

56
- Advertisement -

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పండుగలకు ఆచారాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగ ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. ప్రతి ఏటా పిల్లల నుంచి పెద్దల వరకు కుల మతాలకు అతీతంగా జరిపుకునే పండుగలలో వినాయక చవితి ముందు వరుసలో ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు విఘ్ణాధిపతి విఘ్నేషుడిని తలచుకోవడం భారతీయులు పరిపాటిగా అనుసరిస్తున్న ఆచారం. ఎందుకంటే తలపెట్టే పనిలో ఎలాంటి విఘ్నలు లేకుండా ఆ వినాయకుడు చూసుకుంటాడని నమ్మకం.

ఇక మన పండగలు ఒక్కొదానికి ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పండగలను ఓ వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా మన పండగలు,వాటి విశిష్టతను ఓసారి పరిశిలిస్తే..

ఉగాది:

ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక ఉగాది. తీయనైన వసంత కోయిల పాట ఉగాది. షడ్రుచుల మేలవింపు మన తెలుగు సంవత్సరాది ఉగాది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఉగాది. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

శ్రీరామ నవమి: భార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి

హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి .ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది.

వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

మొదటి రోజు వరసిద్ది రూపంలో ఉన్న వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి.రెండో రోజు వికట రూపంలో ఉన్న వినాయకుడికి అటుకులు నైవేద్యంగా పెట్టాలి.
మూడో రోజు లంబోదల రూపంలో ఉన్న వినాయకుడికి పేలాలు, నాల్గో రోజు గజానన వినాయకుడికి చెరకుగడలు, ఐదో రోజు మహోదర రూపంలో ఉన్న వినాయకుడికి కొబ్బరి కురిడి, ఆరో రోజు ఏకదంత వినాయకుడికి నువ్వులతో చేసిన పదార్థాలు, ఏడో రోజు వక్రతుండ వినాయకుడికి అరటిపండ్లు మరియు ఇతరత్రా పండ్లు, ఎనిమిదో రోజు విఘ్నరాజ వినాయకుడికి సత్తుపిండి వంటివి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చివరగా తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ రూపంలో ఉన్న వినాయకుడికి నేతితో చేసిన అప్పాలు, అలాగే నేతితో చేసిన ఇతరత్రా పిండి వంటకాలు నైవేధ్యంగా పెడతారు.

రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

హిందూ పండగల్లో రాఖీ పౌర్ణమి ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఈ పండగ రోజున మహిళలు తమ అన్నాదమ్ముల చేతులకు రాఖీలను కడతారు. అక్కాచెల్లెళ్లకు అన్నాదమ్ములకు మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ పండగా నిలుస్తోంది. తమ సోదరులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మహిళలు వారికి రాఖీలు కడతారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇచ్చి గౌరవిస్తారు.

Also Read:ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం:కేటీఆర్

అక్షయ తృతీయ:-* విలువైన వాటిని కూడబెట్టుకోమని.

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

*వ్యాస (గురు) పౌర్ణమి :-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. గురు పూర్ణిమ‌… గురువుల‌ను, పెద్ద‌ల‌ను పూజించే పండుగే గురు పూర్ణిమ‌. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురు పూర్ణిమ రోజు చాలా మంది ఉప‌వాసం ఉండి సాయంత్రం చంద్రుడు ఉద‌యించిన త‌ర్వాత ఆహారం తీసుకుంటారు. ఇది గురు పూర్ణిమ విశిష్ట‌త‌. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. శ్రావణమాసంలో అమ్మ వారికి శ్రావణపూజలు చేస్తే తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని మహిళల నమ్మకం. దోష శుద్ధికోసం శుద్ధలక్ష్మిని, మోక్షం కోసం మోక్షలక్ష్మిని, జయం కోసం జయలక్ష్మిని, విద్యాప్రాప్తి కోసం సరస్వతీదేవిని, సిరిసంపద, సుఖసంతోషాలకోసం వరలక్ష్మీని పూజిస్తారు.

పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

హిందువుల పండుగలలో ప్రత్యేకమైనది దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దీపావళి. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో జరుపుకొనే పండుగ.

కార్తీక పౌర్ణమి :-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

సంక్రాంతి :-* మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహాశివరాత్రి :-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

హిందూ పండగలన్ని తిధులతోను,నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. మహా శివరాత్రి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివనామస్మరణతో అనుకున్నది నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి.మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి ఉపవాసం ఉండటం ,రాత్రి జాగరణ చేయడం ,శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం. పరమేశ్వరుడు భక్తసులభుడు. తలపై కొద్దిగ గంగనుపోసి విభూది రాస్తేచాలు పరవశుడై అడకనే వరాలు గుప్పించే బోలా శంకరుడు. ఆస్వామిని కొలచి యక్ష,కిన్నెర ,గంధర్వ ,దేవగణాలేకాదు రాక్షసులు సహితము శుభాలను పొందారు. ప్రతినెలలోనూ అమావాస్య ముందువచ్చే చతుర్ధశి నాడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమయినరోజు. దానినే మాస శివరాత్రి అంటారు. మాఘమాసములో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అనిపిలుస్తారు.

హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
()రెండు ఏకాదశిలు*,
()సంకష్ట హర చతుర్థి*,
()మాస శివరాత్రి,*
()ప్రాదోశ వ్రతం,*
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి…..

()ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.
Also Read:ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం:కేటీఆర్

- Advertisement -