సీఎం కేసీఆర్ ముద్దుల మనవడిగా,తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నారు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు. సాయం చేయడంలో వయసు చిన్నదే కానీ మనసు మాత్రం పెద్దది. ఎంతోమందికి సాయం చేసి ప్రేరణగా నిలుస్తున్నారు హిమాన్షు. సీఎం కేసీఆర్ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లిన హిమాన్షు ఉండాల్సిందే.
తాజాగా మరోసారి ఆకట్టుకున్నారు హిమాన్షు. హైదరాబాద్ ఓక్రీడ్జ్ స్కూల్ లో క్రియేటివిటీ, ఆక్టివిటీ, సర్వీస్ థీమ్ (CAS)తో కాస్నివాల్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హెడ్ ఆఫ్ ది కాస్నివాల్ గా వ్యవహరించారు హిమాన్షు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ స్పీచ్‌తో అదరగొట్టారు. హిమాన్షు మాటతీరు అందరిని ఇంప్రెస్ చేసింది.
ఇక ఈ ఈవెంట్ తో వచ్చిన డబ్బులతో స్కూల్ ఎదురుగా ఉన్న నానక్ రాంగూడ చెరువు సుందరీకరణ చేపట్టనున్నారు. ఈవెంట్ ను ప్రారంభించి స్టాల్స్ ను సందర్శించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్బంగా హిమాన్షు అతని బృందం సృజనాత్మకత, సామాజిక దృక్పథాన్ని అభినందించారు సబితా. ఇక ఈ ఓక్రిడ్జ్ కాస్నివాల్ ఈవెంట్ లో సందడి చేశారు సిని హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం.
ఇవి కూడా చదవండి..