జూపిటర్ హాస్పిటల్, పూణేలో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంతోష్ చవాన్ చెబుతున్నారు — ఈ ‘హై-ఫంక్షనింగ్ స్ట్రెస్’ అనే పరిస్థితి మన నిద్ర, హార్మోన్లు, ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. అయితే, కొన్ని సరళమైన మార్పులతో మన శరీర రిథమ్‌ను తిరిగి సరిచేసుకుని మెరుగైన విశ్రాంతిని పొందవచ్చు.
ప్రపంచం “ఎప్పుడూ బిజీగా ఉండాలి” అనే ఆలోచనలో మునిగిపోయింది. మనలో చాలా మంది బయటకు బాగా సజావుగా కనిపించినా మన శరీరం మాత్రం నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. దీనినే ఇది హై-ఫంక్షనింగ్ స్ట్రెస్ అని పిలుస్తారు. బయటకు మీరు ఉత్సాహంగా కనిపించినా, లోపల మాత్రం నెమ్మదిగా మానసికంగా మరియు శారీరకంగా తరుగుతున్న పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
స్ట్రెస్ ఎక్కువసేపు కొనసాగితే, మెదడు కార్టిసోల్ మరియు అడ్రినలిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మీ శరీరాన్ని అప్రమత్తంగా ఉంచుతాయి .పని పూర్తి చేయడంలో అవి సహాయపడతాయి, కానీ మీ సిస్టమ్ విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి అని డాక్టర్లు చెబుతున్నారు. కాలక్రమేణా ఇది నిద్రలేమి మరింత స్ట్రెస్‌కి దారితీస్తుంది.ఒక చక్రంలా తిరుగుతూ, మీరు అలసిపోయినా విశ్రాంతి పొందలేని స్థితి వస్తుంది. దీని వల్ల ఆందోళన, రక్తపోటు పెరుగుతాయి. దీర్ఘకాలికంగా ఇది బరువు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం, మెటాబాలిక్ సమస్యలు వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
Also Read:విరుచుకుపడ్డ హిమపాతం..7గురు మృతి
దీనిని అధిగమించేందుకు.. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం ద్వారా శరీర రిథమ్‌ను తిరిగి సరిచేయవచ్చు. నిద్రకు ముందు పుస్తకం చదవడం, తేలికైన వ్యాయామం, శాంతమైన సంగీతం వినడం వంటి విశ్రాంతి అలవాట్లు ఏర్పరుచుకోవాలి. రోజు మధ్యలో శ్వాస, చిన్న ధ్యానం, పనుల మధ్య కొద్దిసేపు విరామం తీసుకోవడం కార్టిసోల్ స్థాయిని తగ్గిస్తుంది.

