మహిళల వరల్డ్ కప్ 2025లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి, చారిత్రాత్మక విజయం సాధించి భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించింది హర్మన్ ప్రీత్ సేన.ఇక ఈ మెగా టోర్నీ తర్వాత భారత మహిళల జట్టు షెడ్యూల్, ఏఏ టీంలతో ఆడనుందనే దానిపై అందరిలో ఆసక్తినెలకొంది.
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా కొంత విశ్రాంతి తీసుకుని, కొత్త సవాళ్లకు సిద్ధమవుతుంది. ICC ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం, భారత మహిళా జట్టు 2026 ఫిబ్రవరి 15 నుండి మార్చి 9 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
ఈ టూర్‌లో భాగంగా 3 T20 మ్యాచ్‌లు,3 వన్డే మ్యాచ్‌లు,1 టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఉంటాయి. ఆస్ట్రేలియా టూర్ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో పాల్గొంటారు. దాని అనంతరం, భారత జట్టు 2026 మే 28 నుండి జూన్ 2 వరకు ఇంగ్లాండ్‌లో మూడు T20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
తర్వాత ICC టోర్నమెంట్ మహిళల T20 వరల్డ్ కప్ 2026 ఇంగ్లాండ్ వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటాయి. భారత జట్టు ఇప్పుడు ఆ ట్రోఫీపై కన్నేసింది.
Also Read:AQI:కాలుష్య కోరల్లో ఢిల్లీ..

