IPL:రస్సెల్ స్థానాన్ని భర్తి చేసేదెవరు?

8
- Advertisement -

మూడు సార్లు ఐపీఎల్ విజేతలైన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఐపీఎల్ 2026 సీజన్‌ను సవాళ్లతో ప్రారంభించనుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్ల గైర్హాజరీ జట్టుకు తలనొప్పిగా మారింది. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు విడుదల చేయగా, స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రానా గాయంతో మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. అంతేకాకుండా రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన మతీశా పతిరన హామ్‌స్ట్రింగ్ గాయంతో మొదటి మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది.

దీంతో కేకేఆర్ బౌలింగ్ యూనిట్ అనుభవం లేని పరిస్థితిలో ఉంది. స్పిన్ విభాగంలో సునీల్ నరైన్, వరుణ్ చక్రవరి ఉండగా వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బాని పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.

ఓపెనర్లుగా ఫిన్ అలెన్, కెప్టెన్ అజింక్య రహానే అవకాశం ఉంది. నెట్స్‌లో టిమ్ సెల్ఫీర్ట్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఫిన్ అలెన్‌పై జట్టు నమ్మకం ఉంచే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో కామెరూన్ గ్రీన్, రఘువంశీ, రింకూ సింగ్‌, రమణ్‌దీప్ సింగ్‌ ఆడే అవకాశం ఉంది. ఇక రస్సెల్ స్థానంలో తేజస్వి దహియాను ఆడించే అవకాశముంది.

Also Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!

కేకేఆర్ అంచనా ప్లేయింగ్ XI:

ఫిన్ అలెన్,అజింక్య రహానే (కెప్టెన్),కామెరూన్ గ్రీన్,అంగ్క్రిష్ రఘువంశీ,రింకూ సింగ్,తేజస్వి దహియా (వికెట్ కీపర్),రమందీప్ సింగ్,సునీల్ నరైన్,వైభవ్ అరోరా,
బ్లెసింగ్ ముజారబాని,వరుణ్ చక్రవర్తి.

బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్: మనీష్ పాండే
బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్: అనుకుల్ రాయ్ / కార్తిక్ త్యాగి

- Advertisement -