పట్నం నరేందర్‌ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

3
- Advertisement -

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. నరేంద్రర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. నరేందర్‌ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో పోలీసులు కనీస నిబంధనలను పాటించలేదని..ఇది అక్రమ అరెస్ట్ అన్నారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదని చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని అన్నారు.

Also Read:KTR: గ్యారెంటీల పేరుతో ఆస్తుల జప్తా!

- Advertisement -