- Advertisement -
లాక్ డౌన్ నేపథ్యంలో వరసు సినిమాలతో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారిన ఆర్జీవీ …తాజాగా మర్డర్, దిశా ఎన్కౌంటర్ నేపథ్యంలో సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ రెండు సినిమాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా ఆర్జీవీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మిర్యాలగూడ పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన మర్డర్ మూవీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమా విడుదల ఆపేయాలని నల్గొండ కోర్టు గతంలో తెలపగా హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ.
రామ్ గోపాల్ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. ఇందుకు చిత్ర బృందం సరే అని చెప్పడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి.
- Advertisement -