ఓజీ టికెట్ ధరల పెంపుకు హైకోర్టు బ్రేక్

8
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజీ. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్. బెనిఫిట్ షో టికెట్ ధరలు కూడా పెంచొద్దని తెలిపింది హైకోర్టు.

తెలంగాణలో ఓజీ స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్ వేయనున్నారు. టికెట్ రేటు రూ. 800 కాగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది . సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా టికెట్ ధరలు ఉండగా ధరల పెంపుకు బ్రేక్ వేసింది హైకోర్టు.

Also Read:సాగునీటి రంగంలో ద్రోహి..కాంగ్రెస్!

- Advertisement -