హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా జలాల వాటా పై సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట …పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క… 299 tmc కృష్ణ జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
చారిత్రక తప్పిదం చేసింది మీరు, తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు మీరు..సమ్మక్క సాగర్ పూర్తి చేసింది బిఆర్ఎస్, డబ్బా ప్రచారం చేసుకుంటున్నది కాంగ్రెస్… చంద్రబాబుకు భయపడి బనకచర్ల పై మౌనం…కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆల్మట్టి ఎత్తు పెంపు పై మౌనం… రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే, పక్క రాష్ట్ర ప్రయోజనలే ఎక్కువా? చెప్పాలన్నారు.
కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండు…ఉత్తర కుమార ప్రగల్భాలే పలికిండు…బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురించి నీళ్లు నములుతారు…కనీస అవగాహన లేని, తెలంగాణ సోయి లేని ఇట్లాంటి దద్దమ్మలు మనకు ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి కావడం మన దౌర్భాగ్యం అన్నారు.
ఉత్తం కుమార్ రెడ్డి నిన్న ఏం మాట్లాడిండు..కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినం అని గొప్పగ చెప్పిండు.రైట్ షేర్ కోసం నేనే స్వయంగా ట్రిబ్యునల్ ముందు అటెండ్ అయినట్లు చెప్పుకున్నడు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు ఏమన్నడు కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చిండు.మొన్న సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి ఏమంటడు.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు అన్నారు.
పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు…వీళ్ల అజ్ఞానం వల్ల తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది…ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా? లేదా నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అసలు ఎవరిది కరెక్టు?, కనీస అవగాహన లేకుండా ఎట్ల మాట్లాడుతున్నరు. కనీసం ప్రిపరేషన్ లేకుండా ఇలా ఎన్నాళ్లు ఉంటారు..కేసీఆర్ కృష్ణా జలాల్లో రైట్ ఫుల్ షేర్ సాధించేందుకు సెక్షన్ 3 కోసం పోరాటం చేశారు…ఉమా భారతి, గడ్కరీ, షకావత్, ప్రధానిలను కలిసారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించారు…763 టీఎంసీలు అనేది కేసీఆర్ గారు పట్టుబట్టిన విషయం..ఇప్పుడు తామేదో కొత్తగా 763 టీఎంసీలు డిమాండ్ చేసినట్లు.. డబ్బా కొడుతున్నడు ఉత్తం…ఇప్పుడు వీళ్లు ఏం అంటున్నరు ఓసారి 500, ఓసారి 763, ఓసారి 904 టీఎంసీలు మా వాటా అంటున్నరు.
పూటకో మాట ఘడియకో లెక్క…ఒక బాధ్యత లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. నీటి ప్రయోజనాల మీద పట్టి లేదు…ద్రోహం చేసినోల్లే సుద్దులు చెబుతున్నారు..299:512 ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు.ఉత్తం ఏమంటారు..512:299 నీటి వాటాను బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందట. చారిత్రక అన్యాయాన్ని సరి చేస్తున్నరట.ఛీ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. ముఖ్యమంత్రి అంతే, నీళ్ల మంత్రి కూడా అంతేనని మండిపడ్డారు హరీష్.
Also Read:TGPSCకి హైకోర్టులో ఊరట

