నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలలో రక్తపోటు ఒకటి. సాధారణంగా వయసు పైబడిన వారిలో కనిపించాల్సిన ఈ సమస్య ప్రస్తుత రోజుల్లో పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలమంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఆటంకం ఏర్పడితే హైపర్ టెన్షన్ ( అధిక రక్తపోటు ) కు దారి తీస్తుంది. అధికంగా ఆల్కహాల్ సేవించే వారిలోనూ, మానసికంగా ఆందోళనగా ఉన్నవారిలోనూ ఈ రక్తపోటు సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇంకా శారీరక శ్రమ లేకపోవడం, తినే ఆహారంలో ఉప్పు, కారం వంటివి ఎక్కువగా ఉపయోగించడం వంటివి కూడా రక్తపోటుకు దారి తీస్తాయి. .
రక్తపోటు ఉన్నవారిలో ఛాతీనొప్పి, హృదయ స్పందనల్లో మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, దృష్టి లోపం ఏర్పడడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు గుండె పోటుకు కారణం అవుతుంది. నేటిరోజుల్లో గుండెపోటుతో మరణించే వారిలో అధికరక్తపోటే కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక రక్తపోటు కేవలం గుండె పైనే కాకుండా మూత్రపిండాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందట.
సాధారణంగా కిడ్నీలు రక్తం నుంచి వ్యర్థాలను బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే రక్తపోటు కారణంగా కిడ్నీలలోని నెఫ్రాన్స్ అనే చిన్న రక్తనాళాలు దెబ్బ తింటాయట. అందువల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెఃచ్చరిస్తున్నారు. అందుకే హైపర్ టెన్షన్ విషయంలో ఏ మాత్రం నిర్లక్షం చేయరాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలో ప్రధాన భాగలైన గుండె, కిడ్నీలపైనే దీని ప్రభావం అధికంగా ఉండడం వల్ల అధిక రక్తపోటుకు సరైన మెడిసన్ తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Also Read:కుమారి శ్రీమతి కూడా పెళ్లి గురించే