ప్చ్.. ‘హాయ్ నాన్న’ పరిస్థితి అంతేనా?

109
- Advertisement -

కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో హీరో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా ‘హాయ్ నాన్న’. నేడు ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ప్రీమియర్ షో టాక్ ప్రకారం.. సినిమా ప్రారంభంలో నాని, కూతురు సెంటిమెంట్ ని చూపిస్తారు. ఈ సినిమా కేవలం నాన్న సెంటిమెంట్ మాత్రమే కాకుండా ప్రేమ, పెళ్లి ఎమోషన్స్ తో కూడా నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు. కానీ, సినిమా బాగా స్లోగా ఉందని.. సినిమాలో మ్యాటర్ ఉన్నా.. సెకండ్ హాఫ్ బాగా నీరసంగా సాగింది అని చెబుతున్నారు.

మరోపక్క హాయ్ నాన్నకు బిజినెస్ కూడా బాగా జ‌రిగింది. రూ.27 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రుపుకున్న హాయ్ నాన్న సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చి ఉండి ఉంటే.. బ్రేక్ ఈవెన్ కావ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమీ కాదు. కానీ, ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ ఉంది. కాబట్టి, ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం ‘హాయ్ నాన్న’ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. అందుకే, త్వరగా తన కొత్త సినిమాని స్టార్ట్ చేయాలని నాని కసరత్తులు చేస్తున్నాడు. త‌మిళ డైరెక్ట‌ర్ సిబి చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేయ‌నున్నాడు.

అన్నట్టు, ఈ సినిమాలో నానికి జోడీ కోసం పూజా హెగ్డేని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. ఇదే నిజ‌మైతే నాని, పూజా క‌లిసి న‌టించబోయే ఫ‌స్ట్ సినిమా ఇదే అవుతుంది. ఇప్ప‌టికే నాని వివేక్ ఆత్రేయ‌తో స‌రిపోదా శ‌నివారం అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాని, బ‌లగం డైరెక్ట‌ర్ వేణుతో ఎల్ల‌మ్మ అనే సినిమా చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నానినే చెప్పాడు. వేణు రెడీ చేసిన ఎల్ల‌మ్మ స్క్రిప్ట్ విన‌లేద‌ని, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మిస్ చేసుకోన‌ని నాని తెలిపాడు.
Also Read:ఎండు ద్రాక్ష తినడం వల్ల.. ఆ సమస్యలకు చెక్!

 

- Advertisement -