నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
గత 24 గంటల్లో కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొంది.
ఇవాళ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.