చెన్నై చెపాక్ స్డేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ వెస్టిండిస్ మ్యాచ్ లో విండిస్ 8వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన విండిస్ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ధిత 50ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 287పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6, విరాట్ కోహ్లి 4 పరుగులకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 36పరుగులు చేయగా ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 88బంతుల్లో 70 పరుగులు చేశాడు.ఇండియా బ్యాటింగ్ అయ్యార్ కీలకంగా నిలిచాడు. ఇక మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ కూడా రెచ్చిపోయాడు. 69బంతుల్లో 71పరుగులు సాధించాడు. శ్రేయాస్, పంత్‌తో పాటు కేదార్ జాదవ్ కూడా రెచ్చిపోయాడు. జాదవ్ 35 బంతుల్లో 45పరుగులు చేశాడు.
288పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒపెనర్ అంబ్రిన్ 9పరుగులకే అవుట్ కాగా మరో ఓపెనర్ హెట్ మైర్ రెచ్చిపోయాడు. 106 బంతుల్లో 139పరుగులు చేవాడు. ఆ తర్వాత టచ్‌లోకి వచ్చిన షై హోప్ సైతం సెంచరీ చేశాడు. 151 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. వీరిద్దరు విండీస్ గెలుపులో కీలకంగా మారారు. మరో 13బంతులు మిగిలి ఉండగానే విండీస్ విజయం సాధించింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, షమీ తలో వికెట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ విజయంతో విండీస్ 1-0తో ఆధిక్యలో ఉంది. ఇక తర్వాతి మ్యాచ్ 18వ తేదిన విశాఖపట్నంలో జరుగనుంది. ఒక వేళ సెకండ్ మ్యాచ్ ఇండియా గెలిస్తే చివరి మ్యాచ్ హోరాహోరిగా సాగనుంది.