దొరసానితో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్

294
Rahul Sipligunj Shivatmika

బిగ్ బాస్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతకు మందు అతడు కొన్ని సాంగ్స్ చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన క్యారక్టర్ కు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక రాహుల్ కు ఆఫర్లు బాగానే వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు సింగర్ గా ఉన్న రాహుల్ ఇప్పటినుంచి నటుడిగా కూడా కనిపించనున్నారు. క్రియేటివ్ దర్శకుడు క్రీష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో రాహుల్ కీలక పాత్రలో నటించనున్నారు.

మరాఠి సినిమా నటసామ్రాట్ కు రీమేక్ గా రంగమార్తాండ తెరకెక్కుతుంది. ఈమూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందంతో పాటు పలువురు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈమూవీలో జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఉన్న సమాచారం మేరకు రాహుల్ కు జోడిగా శివాత్మిక నటించనుందని తెలుస్తుంది. కాగా రాహుల్ ఇటివలే ఈమూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దర్శకుడు కృష్ణవంశీతో దిగిన ఫోటోను ట్వీట్టర్ ద్వారా షేర్ చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు రాహుల్.