గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన హెటిరో డైరెక్టర్

14
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హెటిరో డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్‌రెడ్డి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మాజీ ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్,డాక్టర్ మురళీ ,డాక్టర్ ఉత్తమ్ కుమార్, డాక్టర్ పురాణి,డాక్టర్ యోగేష్ రెడ్డి, కొనుకటి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read:US Elections: కమలాతో డిబేట్‌కు ట్రంప్ ఓకే

- Advertisement -