అలరిస్తున్న ‘హి ఈజ్ సో క్యూట్’ సాంగ్‌..!

522
mahesh
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘హి ఈజ్‌ సో క్యూట్‌..హి ఈజ్‌ సో స్వీట్..హి ఈజ్‌ సో హ్యాండ్సమ్‌’ అంటూ మహేశ్‌బాబును ఫాలో అవుతూ రష్మిక పాడే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

శ్రీమణి రాసిన ఈ పాటను మధుప్రియ పాడింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య‌శాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది.

- Advertisement -