దుమ్ములేపుతున్న ‘దర్బార్’ ట్రైలర్..!

565
Rajinikanth
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజినీ ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన `దర్బార్` మోషన్ పోస్టర్,టీజర్‌ కి ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా ` దర్బార్` చిత్రం నుండి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. “అయాం ఏ బ్యాడ్ కాప్” (నేను మహా చెడ్డ పోలీసును) అంటూ రజనీ చెప్పే డైలాగు అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. “పోలీసుల వద్దకు లెఫ్ట్‌లో రావొచ్చు, రైట్‌లో రావొచ్చు కానీ స్ట్రెయిట్‌గా రాకూడదు” అనే డైలాగ్ మరింత రక్తికట్టించేలా ఉంది. ముంబయి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రతినాయక పాత్ర పోషించాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.

Superstar Rajinikanth’s latest film ‘Darbar’ Directed by Star Director AR Murugadoss is gearing up to release for Sankranthi..

- Advertisement -