- Advertisement -
టాలీవుడ్ హీరోలు ఒక్కొకరుగా పెళ్లిబాట పడుతున్నారు. హీరో నితిన్ షాలిని రెడ్డి ని వివాహం చేసుకొనున్నాడు. ఇటివలే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఇక వీరిద్దరి వివాహం ఎప్రిల్ 16న దుబాయ్ లో జరుగనుంది. అతికొద్ది మంది అతిధుల మధ్యలో వీరు వివాహం చేసుకోనున్నారు. వివాహం అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఇక మరో హీరో నిఖిల్ పల్లవి వర్మను పెళ్లి చేసుకోబుతున్నాడు.
ఇటివలే వీరి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇందులో విచిత్రం ఎంటి అంటే ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్నారు. నితిన్-షాలినిలు ఏప్రిల్ 16న దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇక అదే రోజు నిఖిల్ పల్లవి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. అయితే నిఖిల్ పెళ్లి మాత్రం హైదరాబాద్ లోనే జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు హీరోలు ఒకే రోజు పెళ్లి చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. .
- Advertisement -