ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ హాలీవుడ్ లో పాపులర్ అయిన ప్రియాంక చోప్రాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన ఎన్టీఆర్ కి.. ఆస్కార్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా కోసం ప్రియాంక చోప్రాను తీసుకుంటే.. ఇంటర్ నేషనల్ వైడ్ గా ఈ సినిమాకి బజ్ ఉంటుంది.
పైగా ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం మిగిలిన పాత్రల్లో కూడా భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని అడుగుతున్నారు. కాకపోతే, ఇప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో విలన్ క్యారెక్టర్ కు అక్షయ్ కుమార్ ఒప్పుకుంటాడో లేదో మరి. ప్రశాంత్ నీల్ దర్శకుడు కాబట్టి.. అలాగే ఎన్టీఆర్ – ప్రియాంక చోప్రా జంటగా వస్తున్న సినిమాలో విలన్ పాత్ర కాబట్టి.. అక్షయ్ కుమార్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. పైగా ప్రశాంత్ నీల్ అంటేనే భారీ సినిమా. మరి అక్షయ్ కుమార్ కూడా ఈ టీంలో జాయిన్ అయితే.. ఫుల్ కిక్ ఉంటుంది ఫ్యాన్స్ కి.
Also Read:వావ్.. ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది
ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథను యూఎస్ నేపథ్యంలో రాశారని..యూఎస్ లో సినిమా స్టార్ట్ అయినా.. దేశాల మధ్య వార్ పై ఈ సినిమా సాగుతుందని గతంలోనే వార్తలు వినిపించాయి. వార్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా కోసం ప్రపంచ యుద్ద వీరులు అంతా పోటీ పడతారని.. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసే క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ తారక్ పాత్ర సాగుతుందని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమాలో యాక్షన్ ఎడ్వెంచరెస్ సీన్లు అద్భుతంగా ఉంటాయట. మొత్తానికి ఎన్టీఆర్ కి హీరోయిన్ – విలన్ ఫిక్స్ అయ్యారు.
Also Read:చైనాను దాటం..సమస్యలు అధిగమిస్తామా?