కమల్ హాసన్ కూతరు శృతిహాసన్ గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంగ్లండ్‌కి చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఆమె.. అతన్ని ఇండియా తీసుకొచ్చి తన తల్లి దండ్రులకు కూడా పరిచయం చేసింది. కానీ ఉన్నట్టుండి ఊహించని రీతిలో అందరికీ షాకిస్తూ తన ప్రియుడు మైకేల్‌కి బ్రేకప్ చెప్పేసింది శృతి హాసన్.
దీంతో అమ్మడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం శృతి తెలుగు,తమిళ సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన లాభం అనే చిత్రం నటిస్తోండగా, తెలుగులో రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ మీ పెళ్లెప్పుడో చెప్పండి, దానికి మీ అభిమానులమైన మమ్మల్ని ఆహ్వానించండి అంటూ ఒక అభిమాని ట్విట్టర్ ద్వారా శృతికి విజ్ఞప్తి చేశాడు. దానికి నెమ్మదిగానే స్పందిచిన శృతి పెళ్లికైతే ఇంకా చాలా ఆలస్యం అవుతుంది కానీ ముందుగా పుట్టినరోజు పార్టీని కలిసి చేసుకుందాం అంటూ సరదాగా సమాధానమిచ్చింది.