విజయ్‌ చెప్పినా నేను వినలేదు- సంగీత

268
Heroine Sangeetha talks about Hero Vijay
- Advertisement -

అందంతో పాటు అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన నిన్నటితరం కథానాయికలలో సంగీత ఒకరు. హీరోయిన్ సంగీత తెలుగుతో పాటు త‌మిళ్‌లో కొన్ని సినిమాలు చేసింది.‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే..’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘ఖుషి ఖుషీగా’, ‘సంక్రాంతి’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా త‌మిళ్ హీరో విజ‌య్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సంగీత.

హీరో విజయ్ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో స్నేహం ఉండేది. ఒకరింటికి ఒకరం వచ్చి వెళుతుండేవాళ్లం. విజయ్ సినిమాతోనే తమిళంలో నా ఎంట్రీ జరగాలని మా అమ్మ భావించింది గానీ కుదరలేదు. విజయ్ మాత్రం నా విషయంలో చాలా కేర్ తీసుకునేవాడు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండాలని చాలా గట్టిగా చెప్పేవాడు. కానీ నేను ఓ వ్యక్తి ప్రేమలో పడిపోయాను.

Heroine Sangeetha talks about Hero Vijay

‘విజయ్‌ అన్ని చెప్పినా.. నేను క్రిష్‌తో ప్రేమలో పడ్డాను. ఓ రోజు విజయ్‌కు క్రిష్‌ను పరిచయం చేయాలి అనుకున్నా. ఆ విషయం విజయ్‌తో చెప్పా. క్రిష్‌ను చూసిన తర్వాత ఆయన నన్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. క్రిష్‌ చూడటానికి చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడని, మా జంట బావుందని అభినందించారు. క్రిష్‌ అసలు పేరు విజయ్‌. విజయ్‌ భార్య పేరు సంగీత. అలా అనుకోకుండా మా జంటల పేర్లు కలిశాయి’. ఇలా అనుకోకుండా జరగడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

- Advertisement -