మయోసైటిస్ చికిత్స కోసం ఓ హీరో నుంచి రూ.25కోట్ల అప్పుతీసుకున్నట్లు వచ్చిన వార్తలపై సమంత స్పందించింది. మయోసైటిస్ చికిత్సకు రూ.25కోట్లా?. అందులో నిజం లేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకూ నేను రాళ్లూరప్పలు సంపాదించలేదనుకుంటా. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్‌తో చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి వార్తలు అందించే ముందు దయచేసి బాధ్యత వహించండి అంటూ ఇన్‌స్టాలో సమంత పోస్టు చేసింది. మొత్తానికి ఈ పోస్ట్ తో అప్పులు చేసే అవసరం తనకు లేదు అని సమంత క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతానికి సమంత హీరోయిన్ గా కూడా ఫుల్ బిజీగా ఉంది. సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇవ్వాలని సమంత మొదట భావించినా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంది అని తెలుస్తోంది. తమిళంలో ఓ సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం సమంత ఖుషి సినిమాతో బిజీగా ఉంది. హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ ‘ఖుషి’ పై సమంత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
అన్నట్టు తాజాగా ఖుషి ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది టీమ్. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 9న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ మొత్తం సమంత చుట్టే తిరుగుతుందట. మొత్తానికి ఖుషి లో సమంత క్యారెక్టరే మెయిన్ హైలైట్ గా ఉంటుందట. పైగా ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా సమంత ఓ ఐటమ్ సాంగ్ చేయబోతుంది అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సమంత మళ్లీ ఫుల్ బిజీ కాబోతుంది. కాబట్టి.. అప్పు చేయాల్సిన అవసరం సమంతకు లేదు.
Also Read:ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం..