వెళ్లవయ్యా వెళ్లూ అంటూ ‘జయం’తో ప్రేక్షకుల హృదయాలకి గాలం వేసిన అందాల తార సదా. తర్వాత తెలుగులో ఆమెకి అవకాశాలు వెతుక్కుంటు వచ్చాయి. విలక్షణ దర్శకుడు శంకర్ తీసిన ‘అపరిచితుడు’తో మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే తర్వాత సినిమాలకు దూరమైన సదా రీసెంట్‌గా వచ్చిన టార్చ్‌లైట్‌తో అంతగా మెప్పించలేకపోయింది.
38 ఏళ్లు వచ్చిన ఈ అమ్మడు ఇంకా పెళ్లిచేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం అడవులకి వెకేషన్ కి వెళ్లిన సదా అక్కడ తీసిన ఓ వీడియోని షేర్ చేసి భారీగానే మ్యాటర్ పెట్టింది. అవసరాల కోసం ఉన్న బంధాల్లో చిక్కుకుపోయి, ఆ మనుషులు వెళ్ళిపోతారేమో అని ఎందుకు భయపడుతున్నారు. మనం సన్నిహితులు అనుకునే వాళ్ళు మనల్ని అనుకోకపోతే వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. మీ జీవితంలో మీకు మీరు మాత్రమే తోడుగా ఉంటారు. లైఫ్ లోకి ఎంతోమంది వస్తారు, వెళ్తారు అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.
అలాంటి వ్యక్తుల గురించి మీ లైఫ్ ని ఇబ్బంది పెట్టకండి. మీకు నచ్చని వారితో మీరు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాల్సినవసరం లేదు. మీతో నిలబడలేని వాళ్ళ గురించి మీరు బాధపడటం మీకే మంచిది కాదు. ఒక్కోసారి అలాంటి వ్యక్తులని మన లైఫ్ నుంచి తప్పిస్తేనే మంచిది. తప్పుడు మనుషుల కోసం జీవితం వృధా చేసుకోకండి. బలవంతపు బంధాలలో ఇరుక్కోవడం కంటే ఒంటరిగా ఉండటం మేలు అని తెలిపిదంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..